అనంతగిరి: కర్ర సాయంతో పొంగి పొర్లుతున్న వాగు దాటిన గిరిజనులు

58చూసినవారు
అల్పపీడన ప్రభావంతో అనంతగిరి మండలంలోని  3రోజులుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో మండలంలోని లుంగాపర్తి పంచాయతీ పరిధి ఒనుకొండ మల్లిపాడు గ్రామాలకు వెళ్లే వాగుపై వంతెన లేక గిరిజనులు బుధవారం కర్ర సహాయంతో వాగు దాటారు. అత్యవసర పనుల కోసం పట్టణ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించేందుకు ఇలా వారు వాగు దాటుతున్నారు. అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మించి, కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్