అరకులోయ మండలంలో ఉన్న రైల్వే రిక్వెస్ట్ స్టేజికి వెళ్లే రహదారికి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సిసి రోడ్డు లేక కురుస్తున్న వర్షాలకు ఉన్న మట్టిరోడ్డు బురదమయమై విశాఖ నుంచి పాసింజర్ లు అరకులోయకు వచ్చే పోయే ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గిరిజనులు బుధవారం తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి రైల్వే రిక్వెస్ట్ రహదారిపై సిసి రోడ్డు నిర్మించాలని కోరారు.