అరకులోయ నుంచి సుంకరమెట్ట ఘాట్రోడ్డు మీదుగా విశాఖకి వెళ్లే ప్రధాన రహదారికు ఇరువైపులా ఉన్న తుప్పలతో వాహనచోదకులు పర్యాటక వాహనాలు నిత్యం తిప్పలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుకు ఇరువైపుల దట్టంగా తుప్పలు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని పలువురు వాహనదారులు ఆదివారం తెలిపారు. ఈ సమస్యపై సంబంధిత ఆర్అండ్బి అధికారులు స్పందించాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.