అనంతగిరి: గుమ్మ పంచాయతీ కర్రీ గోడ గ్రామంలో రోడ్డు మార్గం లేక ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడళ్ల స్థానిక గిరిజనులు, గర్భిణీలు తీవ్ర అవస్థలు ఎదురుకుంటున్నారు. బుధవారం కర్రీ గోడ గ్రామానికి చెందిన కొర్ర రాధ (25) నిండు గర్భిణీకి పురిటీ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి డోలి సహాయంతో తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కర్రీ గోడ గ్రామానికి రోడ్డు సాకర్యం కల్పించాలని కోరుతున్నారు.