గ్రామస్థాయిలో ఉన్నత వైద్యాన్ని గిరిజనులకు అందించాలనే లక్ష్యంతోనే వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తున్నామని అల్లూరి జిల్లా వైద్య శాఖ ప్రత్యేక అధికారి జమాల్ భాషా అన్నారు. సోమవారం డుంబ్రిగుడ మండలంలోని కొర్ర పంచాయతీ పరిధి బొర్రపాలెంలో 104 ద్వారా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వైద్యాన్ని విస్తృతం చేసి వ్యాధుల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు.