బుచ్చయ్యపేట: దుర్గమ్మ ఊరేగింపు సంబరంలో అలరించిన కోలాటం

56చూసినవారు
బుచ్చయ్యపేట మండలంలోని వడ్డాది బ్రాహ్మణ వీధిలో స్థానిక పొగాకు వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి శనివారం రాత్రి నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు.ఈనెల 3 నుండి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. చిటికల భజనలు, కోలాటాలు, మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు.పెద్ద బజారు, చిన్న బజారు వీధుల మీదుగా అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుంది. స్థానిక పెద్దేరు నదిలో నిమజ్జనోత్సవం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్