బుచ్చయ్యపేట: వైసీపీ నేతలు బరితెగింపు

52చూసినవారు
బుచ్చయ్యపేట: వైసీపీ నేతలు బరితెగింపు
బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడిలో వైసీపీ నేతలు బరితెగించారు. సోమవారం సాయంత్రం టీడీపీ నాయకులపై కర్రలతో దాడికి తెగబడ్డారు. తెలుగు యువత మండల అధ్యక్షుడు సేనాపతి మణికంఠ, అతని సోదరుడు శ్రీనివాసరావులపై వైస్‌ ఎంపీపీ గొంపా చినబాబు, అతని కుమారులు, సోదరుడి కుమారులు దారి కాచి కర్రలతో దాడి చేశారు. దీంతో మణికంఠ, శ్రీనివాసరావులకు తీవ్రంగా గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై పోలీసులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్