గోవాడ సుగర్స్లో కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో నిరసనగా కార్మికులు గురువారం విధులు బహిష్కరించి అర్ధనాగణంగా మోకాళ్లపై నిలబడి సామూహిక నిరసన తెలిపారు. తమకు జీతాలు చెల్లించే వరకు ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే వారం రోజులుగా ఆందోళన చేస్తున్నామని సంక్రాంతికి జీతాలు చెల్లిస్తామని ఎండీ హామీ ఇచ్చినప్పటికీ పండగ పోయిన నేటికి ఎలాంటి స్పందన లేదని యూనియన్ నాయకుడు కే భాస్కర్ రావు అన్నారు.