వైసీపీ ప్రభుత్వ రాగానే అన్నా క్యాంటీన్లను మూసివేసింది. దీనిపై టీడీపీ పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో ఏపీలో గెలవడంతో రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన అన్నా క్యాంటీన్లు తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయగానే ఒకటి రెండ్రోజుల్లో అంటే ఈనెల 14, 15వ తేదీల్లో విశాఖలో మూతపడిన అన్నా క్యాంటీన్లను తెరవనున్నారు.