విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉక్కు కార్మికులు చేపట్టిన 36 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కూర్మనపాలెం దీక్షా శిబిరం వద్ద మంగళవారం రాత్రి నిరసనకారులు నిద్రసాగించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా కాపాడాలని, దీనికి ప్రధానికి స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు కార్మికులు డిమాండ్ చేశారు. తమ గళం వినిపించేందుకు 36 గంటల దీక్ష చేపట్టినట్టు ఉక్కు ఉద్యోగులు, కార్మికులు తెలిపారు.