గాజువాక నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమితులైన తిప్పల దేవన్ రెడ్డి సోమవారం విశాఖ బీచ్ రోడ్డులో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో సోమవారం భేటీ అయ్యారు. గాజువాక నియోజకవర్గంలో పరిస్థితులను ఆయన బొత్సకు వివరించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని దేవన్ రెడ్డికి బొత్స సూచించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.