చత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ స్టీల్‌ప్లాంటుకు డిప్యుటేషన్‌పై వెళ్లడానికి విశాఖ ఉక్కు ఉద్యోగులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఇక్కడి నుంచి నగర్నార్కు వంద మందిని డిప్యుటేషన్‌పై పంపాలని నిర్ణయించింది. దీని కోసం మంగళ, బుధవారాల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసింది. మంగళవారం కేవలం 30 మంది మాత్రమే ఇంటర్వ్యూకు హాజరయ్యారు.