ఆసుపత్రులలో లింక నిర్ధారణ పరీక్షలు చేస్తే 5 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని జిల్లా సీనియర్ సివిల్ చర్చ్ వెంకట శేషమ్మ హెచ్చరించారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లకు మహిళల హక్కుల పరిరక్షణ లింక వివక్షపై అవగాహన నిర్వహించారు. ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే మొదటిసారి రూ 10, 000 జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష, 5 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తామన్నారు.