మాడుగుల ఆర్టీసీ బస్ స్టేషన్ పునః ప్రారంభానికి వేయవలసిన నలభై అడుగుల వెడల్పాటి గ్రావెల్ రోడ్డు నిర్మాణ సర్వే కోసం , మాడుగుల రెవెన్యూ సిబ్బంది సర్వే చేసేందుకు గాను ముందుగా ప్రతిపాదిత సర్వే ప్రాంతం మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేయవలసిందిగా తహసిల్దార్ కోరారు. దీంతో మాడుగుల యువత సొంత నిధులు చందాలుగా వేసుకొని ప్రతిపాదిత సర్వే ప్రాంతం మొత్తం జెసిబితో జంగిల్ క్లియరెన్స్ గ్రౌండ్ క్లియరెన్స్ పనులు శనివారం చేపట్టారు.