గొలుగొండ మండలంలో పెన్షన్ దారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఎమ్మార్వో పీ. శ్రీనివాసరావు, ఎంపీడీవో మేరీరోజ్ పెన్షన్ దారుల ఇళ్లకు గురువారం వెళ్లి విచారణ చేపట్టారు. ఎమ్మార్వో మాట్లాడుతూ సమగ్ర విచారణ చేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు.