నర్సీపట్నంలో డిసెంబర్ 20 నుంచి 22వ తేదీ వరకు సీపీఎం అనకాపల్లి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి. వెంకన్న, జి. కోటేశ్వరరావు మండల కార్యదర్శి రాజు పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో శుక్రవారం మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. జిల్లాలోని మూతపడిన ఘగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని, జిల్లాలోని నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షేడ్యూల్డోలో చేర్చాలని డిమాండ్ చేశారు.