నర్సీపట్నం: చెరువులు రిజర్వాయర్ల అభివృద్ధికి పని చేయాలి

69చూసినవారు
నీటి సంఘాల ఎన్నికల్లో ఎన్నికైన ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు చెరువులు, రిజర్వాయర్ల అభివృద్ధి కోసం పని చేయాలని స్పీకర్ సీహెచ్. అయ్యన్నపాత్రుడు అన్నారు. శనివారం నియోజకవర్గంలోని ఎన్నికైన నీటి సంఘాల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లతో నర్సీపట్నంలో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. చెరువుల గేట్ల మరమ్మతులు, లైనింగ్ పనులు, ఆనకట్ట అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్దం చేస్తే ఆ పనులకు అవసరమైన నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్