నాతవరం మండలం సరుగుడు, సుందరకోట పంచాయతీ శివారు 16గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు రూ. 30లక్షలతో ప్రతిపాదనలు పంపించామని నాతవరం ఏఈ చంద్రమౌళి గురువారం నాతవరంలో తెలిపారు. ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు అదనపు ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేశామన్నారు. కొండల మీద ఉన్న గిరిజనుల ఇళ్లకు ఉచితంగా విద్యుత్ మీటర్లు, ఇతర సామగ్రి సరఫరా చేసేందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశామన్నారు.