చింతపల్లి: సొంత నిధులతో తాత్కాలిక పాఠశాల భవనం

78చూసినవారు
చింతపల్లి: సొంత నిధులతో తాత్కాలిక పాఠశాల భవనం
చింతపల్లి మండలంలోని బలపం పంచాయతీ పరిధి వీరవరంలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోకపోవడంతో విద్యార్థులు చదువుకునేందుకు తల్లిదండ్రులు సొంత ఖర్చులతో మంగళవారం రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టారు. అధికారులు ప్రభుత్వం స్పందించి వీరవరంలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టి విద్యార్థుల కష్టాలు తీర్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్