గ్రామ యువకులతో శ్రమదానం

70చూసినవారు
గూడెం కొత్త వీధి: పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం ఉంటుందని అనే నినాదంతో.. గురువారం రింతాడ పంచాయితీ చేలకవీధి గ్రామం ఆవరణంలో యువకులతో, కలిసి స్థానిక ఉపసర్పంచ్ సోమేశ్ కుమార్ సీసీ రోడ్డు ఇరువైపుల కలుపు మొక్కలను తొలగించి, పరిసరాలు పరిశుభ్రం చేయూటలో శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో మన్యపుత్ర యువజన సంఘ సభ్యులు చంద్రశేఖర్, గోవిందరాజ్, శ్రీను, దావీదు, తదితర యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్