స్థానిక సంస్థలు ఎన్నికలకు సిద్ధం కావాలని జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ ఇన్ ఛార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య అన్నారు. సోమవారం పాడేరు పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు వీర మహిళలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు.