శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శనివారం భవాని భక్తులు బోనాలతో దుర్గమ్మను వైభవంగా ఊరేగించారు. శనివారం లింగాపురం గ్రామస్తులు వారి గ్రామం నుండి కోటవురట్ల మరిడి తల్లి ఆలయం వరకు మహిళలు బోనాలతో వెళ్లారు. అనంతరం వరాహ నదిలో అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.