కనుమను పురస్కరించుకుని మండల కేంద్రమైన కోటవురట్ల సంతబయల రామ కోవెల వద్ద బుధవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పలువురు మహిళలు, బాలికలు ఉత్సాహంగా పాల్గొని వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. విజేతలకు సాయంత్రం బహుమతులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చినట్లు తెలిపారు.