20, 21 తేదీల్లో మండల స్థాయి ఆటల పోటీలు

53చూసినవారు
20, 21 తేదీల్లో మండల స్థాయి ఆటల పోటీలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20, 21తేదీల్లో మండల స్థాయి ఆటల పోటీలను ఎస్ రాయవరం మండలం కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో నిర్వహించనున్నట్లు ఎంఈఓ బి. సత్తిబాబు బుధవారం తెలిపారు. ఎస్ రాయవరం ఎంఈఓ కార్యాలయంలో ఆటలు పోటీలపై సమీక్ష నిర్వహించారు. అండర్ 14, 17 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మండల కోఆర్డినేటర్ కె శ్రీను, వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపీ సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్