ఇంట్లోకి దూసుకుపోయిన లారీ

78చూసినవారు
ఇంట్లోకి దూసుకుపోయిన లారీ
పాయకరావుపేట నియోజకవర్గంలోని గోకులపాడు గ్రామంలో ఓ ఇంటిపైకి లారీ దూసుకొచ్చింది. మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. విశాఖ నుంచి కర్నాటక వెళుతున్న లారీ గోకులపాడు సమీపంలోనికి వచ్చేసరికి నిద్ర మత్తులో డ్రైవర్‌ రోడ్డు పక్కన ఉన్న శ్లాబ్‌ ఇళ్లను బలంగా డీకొట్టాడు. ఇంటి ముందున్న షెడ్డు, మరుగుదొడ్డిని ఢీకొట్టి లారీ ఆగిపోయింది. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్