విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న స్వామివారి నిత్యాన్న ప్రసాదానికి బాలాజీ హిల్స్ వ్యూకు చెందిన బి. రామకుమార్, మౌనిక దంపతులు గురువారం విరాళం ప్రకటించారు. రూ. 1, 00,116 నగదు రూపంలో పీఆర్‌వో ఆఫీసులోని అన్నదానం కౌంటర్‌లో చెల్లించి రశీదు పొందారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు.