ఈ నెల 10వ తేదిన ప్రపంచ ఆత్మహత్య నిరోధక దినం సందర్భంగా ఆదివారం విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పీఏపీ ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు అధ్యక్షతన సెమినార్ జరిగింది. ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎన్ ఎన్ రాజు మాట్లాడారు. ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య చేసుకొని మరణిస్తున్నారన్నారు. ఆత్మహత్యకు పాల్పడే యువతను గుర్తించే అవకాశం కుటుంబ సభ్యులకు, ఉపాధ్యాయులకు ఉంటుందని తెలిపారు.