విశాఖ పోలీసులు భారీ రికవరీ సాధించారు. ఆగస్టు నెలలో మొత్తం 112 ఫిర్యాదులు అందగా 89 కేసుల్లో 80 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు రూ. 22, 37, 600 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రూ. 38, 25, 000 విలువైన 2005 సెల్ ఫోన్స్ ఆచూకీ కనుగొన్నారు. మంగళవారం నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.