పూరీ తీరంలో తుపాను తీరం దాటింది. సోమవారం మధ్యాహ్నం తీరం దాటినట్టు విశాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటిన సమయంలో గంటకు 50-60 కి. మీ. వేగంతో గాలులు వీచాయని పేర్కొన్నారు. తుపాను తీరం దాటిన నేపథ్యంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. సోమవారం, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.