సిరిపురం: గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి చర్యలు

54చూసినవారు
సిరిపురం: గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి చర్యలు
గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఉత్తరాంధ్రలో ఐదు జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో విశాఖ పోలీస్ రేంజ్ కార్యాలయంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి శనివారం సమావేశం నిర్వహించారు. గంజాయి సాగుకు ఆర్థికంగా మద్దతిస్తున్న వ్యాపారులపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్