విశాఖ: స్వామి వివేకానంద జయంతోత్సవాలు ప్రారంభం

76చూసినవారు
విశాఖ: స్వామి వివేకానంద జయంతోత్సవాలు ప్రారంభం
జనవరి 12న శ్రీ స్వామి వివేకనంద జయంతి పురస్కరించుకొని విశాఖలోని వివేకానంద సంస్థ ప్రతి ఏటా అన్నదాన, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శనివారం సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్ర, తెలంగాణ( ఉమ్మడి రాష్ట్రాల) రౌండ్ టేబుల్ సంస్థ చైర్మన్ మక్సుద్ అహ్మద్ వివేకానంద ట్యూషన్ విద్యార్థిని, విద్యార్థులకు 6 సైకిళ్లను అందించారు. ఈ సందర్భంగా లీడర్ దినపత్రిక వ్యవస్థాపకులు వి. వి. రమణమూర్తి , రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులు సందీప్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్