విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా వైసీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకును పంచిపెట్టారు. ఈ సందర్భంగా గణేష్ కుమార్ మాట్లాడుతూ అందరికీ ప్రేమను పంచడమే క్రీస్తు సందేశం అన్నారు. ఏ మతమైనా, గ్రంథమైన దేవుని కృపలో మనుషులంతా ఒక్కటేనని అన్నారు.