వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలు వద్ద డిజె సౌండ్ ను నిషేధించినట్లు మల్కాపురం సిఐ ఎస్ విద్యాసాగర్ గురువారం తెలిపారు. మండపాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కమిటీ సభ్యులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మండపాల వద్ద రాత్రి సమయాల్లో ఒక సహాయకుడిని ఉంచాలన్నారు. పోలీస్ నిబంధనలను విధిగా పాటించాలన్నారు.