ఉమ్మడి విశాఖ జిల్లాలో అంచనాలకు మించి ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. విశాఖలో 155 దుకాణాలకు 4,139, అనకాపల్లి జిల్లాలో 136 దుకాణాలకు 3,291, అల్లూరి జిల్లాలో 40 దుకాణాలకు 1,205 దరఖాస్తులు అందాయని, మొత్తం 331 దుకాణాలకు సంబంధించి 8,635 దరఖాస్తుల ద్వారా రూ.172.70 కోట్లు ఆదాయం సమకూరింది. రెండో ఏడాదిలో 10% లైసెన్సుల ఫీజులు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని, 2సం.. లలో సుమారుగా రూ.514 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ కానున్నాయి.