ఘోర రోడ్డు ప్రమాదం- ముగ్గురు మృతి

12667చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం- ముగ్గురు మృతి
అచ్చుతాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం గురువారం చోటుచేసుకుంది. లారీ ఢీకొన్న ఘటనలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అచ్చుతాపురం-ఎలమంచిలి రోడ్డులో బైక్పై వెళుతున్న దుప్పుతురుకి చెందిన గొల్లపల్లి శేఖర్, అమలతో పాటు మరో వ్యక్తి మృతిచెందాడు. లారీ చక్రాల కింద మృతదేహం నుజ్జునుజ్జవ్వడంతో అతడి వివరాలు గుర్తించలేకపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపడతున్నారు.

సంబంధిత పోస్ట్