డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు మరోసారి షాక్ తగిలింది. సీఐడీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై అనకాపల్లిలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో విచారణకు గైర్హాజరై.. తన న్యాయవాదిని సీఐడీ కార్యాలయానికి పంపి. తనకు మరో 8 వారాల గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని గుంటూరు సీఐడీ అధికారులు బుధవారం మరో నోటీసులు జారీ చేశారు.