ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. గగల్హేడి గ్రామం నవాడాలో ఇద్దరు దుండగులు తుపాకీతో ఇంట్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు దుండగులను పట్టుకున్నారు. అనంతరం వారిద్దరిని తలకిందులుగా వేలాడదీసి కర్రలతో దారుణంగా కొట్టారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.