బొప్పాయి తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. అయితే మంచిదని అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుందట. ఇది ఒక అలర్జీ కారకం. దీంతో బొప్పాయిని అధికంగా తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అలాగే రక్తంలో నీటి శాతం తగ్గి విరేచనాలు అవుతాయని, డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.