AP: వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అనంతరపురం, సత్యసాయి, కడప ప్రకాశం జిల్లాల్లో అధికారులు ఎన్యూమరేషన్ చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఈ క్రమంలో అరటి రైతులకు హెక్టారుకు రూ. 35,000 ఇన్‌పుట్ సబ్సిడీ, మొక్కలు నాటుకునేందుకు అదనంగా మరో రూ.75వేలు అందజేస్తామని వెల్లడించారు.