రేపు స్కూళ్లకు సెలవు

71చూసినవారు
రేపు స్కూళ్లకు సెలవు
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆదివారం జిల్లా కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కలెక్టర్ సి. నాగరాణి ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వరదల దృష్ట్యా శనివారం కూడా విద్యా సంస్థలకు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు సోమవారం కూడా సాధారణ సెలవు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్