నర్సాపురం: ఆ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన చినమైనవాని లంక, పెదమైనవాని లంక, పేరుపాలెం గ్రామాలను నర్సాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి దాసి రాజు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండేలా సంబందిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవలని ఆదేశించారు. సముద్రంలో వేటాడేందుకు ఎవరు కుడా వేటకు వెళ్ళకూడదు అని ఆదేశించారు.