తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ప్రాంగణంలో శనివారం 6వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. రవీంద్ర భారతి ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు వేడుకలు సాగనున్నాయి. 2020-24 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన 527 మందికి, రెండేళ్ల ఎంటెక్ కోర్సు ఉత్తీర్ణులైన 15 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. 25 మంది పరిశోధన విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు అందజేయనున్నారు.