రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నష్టపోయిన వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోడూరు మండలం కవిటం గ్రామంలో మంగళవారం జరిగిన సిపిఎం నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాల వల్ల లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.