ఆచంటలో నూతన పోలీస్ స్టేషన్ ను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోమవారం ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసెనురాజు, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.