అంగన్వాడీ కేంద్రంలో విహెచ్ఎన్డీ కార్యక్రమం

69చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో విహెచ్ఎన్డీ కార్యక్రమం
పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలోని అంగన్వాడీ కోడ్ నెంబర్ 2 వద్ద శుక్రవారం విలేజ్ హెల్త్ శానిటేషన్, న్యూట్రీషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పౌష్టికారంలోని పోషక విలువల గురించి సూపర్ వైజెర్ వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్ సుబ్బలక్ష్మి లబ్ధిదారులకు వివరించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం భాగ్యకుమారి, అంగన్వాడీ ఆయా, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్