ప. గో. జిల్లాలో ఏర్పాటుచేసిన ఆధార్ సవరణ ప్రత్యేక మొబైల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడారు. జిల్లాలో ఆధార్ లేని ఎరుకుల, యానాది కుటుంబాలు ఒక్కటి కూడా ఉండకూడదని తహసిల్దార్లను ఆదేశించారు. అలాగే అక్టోబర్ 25 వరకు ఆధార్ ప్రత్యేక మొబైల్ క్యాంపులను జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.