జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో జరిగిన డ్యాన్స్ పార్టీపై డిఎస్పీ రవిచంద్ర సోమవారం వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. లక్కవరం శివారు తోటలో డ్యాన్స్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో సిబ్బంది దాడులు చేపట్టారన్నారు. డ్యాన్స్‌లు ముగించుకుని మహిళలు అక్కడ నుంచి వెళ్లిపోయారన్నారు. డ్యాన్స్ పార్టీలో మద్యం సేవిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి వాహనాలను సీజ్ చేశామన్నారు.