మహిళల మెడలోని బంగారు గొలుసులను తెంచుకుపోతున్న గొలుసు దొంగలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జంగారెడ్డిగూడెం డీఎస్పి రవిచంద్ర అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దొంగతనాల నివారణకు మహిళలు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నడకకు వెళ్లేవారు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాలన్నారు. అపరిచిత వ్యక్తులకు దూరంగా నిలబడి మాట్లాడాలని తెలిపారు.