జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎస్ఐ రామకృష్ణ ఆదివారం వాహన తనిఖీలను పుట్లగట్లగూడెం వద్ద నిర్వహించారు. ఈ నేపథ్యంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతూ జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారని డీఎస్పీ రవిచంద్ర సోమవారం తెలిపారు. భీమడోలు చెందిన జీవన్ కుమార్ (19), వెంకటేశ్వరరావు (19) స్నేహితులన్నారు. వీరిపై గతంలో నల్లజర్ల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయన్నారు.