జంగారెడ్డిగూడెం: 14న జాతీయ లోక్ అదాలత్

82చూసినవారు
జంగారెడ్డిగూడెం: 14న జాతీయ లోక్ అదాలత్
జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. కోర్టులో శనివారం నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. రాజీ చేసుకోదగిన కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. తద్వారా సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చన్నారు. ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా న్యాయవాదులు, పోలీసు అధికారులు కృషి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్